జిల్లాలో 13,193 మంది ఆటో డ్రైవర్ సేవలో పథకం కింద లబ్ది పొందనున్నారు. శనివారం ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు పట్టణంలో జిల్లా స్థాయి కార్యక్రమం రెవెన్యూ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తున్నారు.Guntru news :డిప్యూటీ డైరెక్టర్ రమేష్‌కు APUWJ నాయకుల అభినందనలు
లబ్ధిదారుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చేబ్రోలు మండలం 453 మంది, దుగ్గిరాల 344, గుంటూరు అర్బన్ 5,078, గుంటూరు రూరల్ 319, కాకుమాను 131, కొల్లిపర 164, మంగళగిరి 516, మేడికొండూరు 404, పెదకాకాని 711, పెదనందిపాడు 153, ఫిరంగిపురం 250, పొన్నూరు 530, పత్తిపాడు 281, తాడేపల్లి 383, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ 1038, తాడికొండ 440, తెనాలి 1338, తుళ్లూరు 399, వట్టిచెరుకూరు 261 మంది ఉన్నారు.