
హిందూపురంలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి ఘటనకు నిరసనగా గుంటూరులో ఆందోళన జరిగింది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా మీడియాతో మాట్లాడారు.టీడీపీ ఆఫీస్ దాడి కేసును రీఓపెన్ చేసి మరీ అక్రమ అరెస్టులు చేస్తున్న కూటమి ప్రభుత్వం.. వైఎస్సార్సీపీ కార్యాలయంపై జరిగిన విధ్వంసం విషయంలో చూసిచూడనట్లు వ్యవహరిస్తోందని అన్నారు. హిందూపురం వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.
అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపైనా దాడి చేశారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే.. ఆ కేసును రీ ఓపెన్ చేసి మరీ అమాయకులను జైలుకు పంపించారు. కేవలం మీ ఆఫీసుపై దాడి జరిగిందని వేధింపులకు దిగారు. మరి ఇప్పుడు చేస్తోంది ఏంటని వారు సూటిగా ప్రశ్నించారు.







