గుంటూరుఆంధ్రప్రదేశ్

Guntur : Drinking water supply disruption on 31st of this month and 1st and 2nd of September.. Commissioner Puli Srinivasulu

గుంటూరు నగరంలో ఈ నెల 31, సెప్టెంబర్ 1,2 తేదీల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం .. కమిషనర్ పులి శ్రీనివాసులు
ఈ నెల 31వ తేదీన ఉదయం సరఫరా అనంతరం నెహ్రూ నగర్ రిజర్వాయర్ నుండి హెచ్ఎల్ఆర్ రిజర్వాయర్ త్రాగునీటి సరఫరా జరిగే 900 ఎంఎం డయా పైప్ లైన్ కు నెహ్రూ నగర్ పంప్ హౌస్, సంజీవయ్య నగర్ రైల్వే గేటు వద్ద ఇంటర్ కనెక్షన్ చేయాడానికి జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు సిద్దం చేశారని, ఏఈల వారీగా త్రాగునీటి సరఫరా చేసేలా వాటర్ ట్యాంకర్లు సిద్దం చేసుకోవాలని ఆదేశించామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్ పనుల కోసం తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ లోని ఫిల్టరేషన్ పాయింట్ నిలిపివేయడం జరుగుతుందన్నారు. దీని వలన 31వ తేదీ సాయంత్రం నుండి సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం వరకు త్రాగునీటి సరఫరా అంతరాయం కల్గునని, 2వ తేదీ సాయంత్రం నుండి పాక్షికంగా 3వ తేదీ ఉదయం నుండి యధావిదిగా సరఫరా జరుగుతుందని తెలిపారు. పనుల వలన నగరంలోని హెచ్ఎల్ఆర్, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల, ఏటి అగ్రహారం, ఏఎంసి, హోసింగ్ బోర్డ్ కాలనీ, కోర్ట్ కాంపౌండ్, కెవిపి కాలనీ, వికాస్ నగర్, శ్యామల నగర్, హనుమయ్య నగర్, నెహ్రూ నగర్, రాజీవ్ గాంధీ నగర్, బొంగరాలబీడు, వసంతరాయపురం, శారదా కాలనీ, రెడ్డిపాలెం, గోరంట్ల, నగరాలూ తదితర ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాకి అంతరాయం కల్గుతుందన్నారు. కావున నగర ప్రజలు గుంటూరు నగర పాలక సంస్థకు సహకరించి ముందుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.

Authors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker