పేద మహిళల్ని పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. ఇందుకోసం మెప్నా విభాగం చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. నగరపాలక సంస్థలో గురువారం మెప్నా ఆర్పీ లకు ట్యూబ్ లో పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే తోపాటు డిప్యూటీ మేయర్ సజీల, మెప్మా పీడీ విజయలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్పీలకు
ట్యాబ్ లు అందజేయడం ద్వారా ప్రజలు, డ్వాక్రా సంఘాలకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్పీ లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
2,244 Less than a minute