ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని
మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తెలిపారు. 35 వేలు ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ని 10 వేలకు తగ్గించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
గుంటూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో నూతన విద్యా విధానం తీసుకురావడం జరిగిందని చెప్పారు. అయితే ప్రస్తుతం పేదలకు విద్య అందకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మైనార్టీలు, ఓబీసీ లకు రక్షణ లేకుండా పోయిందని ఆయన వెల్లడించారు. రాజధాని నిర్మాణం కోసం కేవలం వెయ్యి ఎకరాల భూమి సరిపోతుందని చెప్పారు. కానీ ఇప్పటికే సేకరించిన
33 వేల ఎకరాలు సరిపోక మరో 40 వేల ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఏపీకి నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదని చింతా మోహన్ పేర్కొన్నారు.
2,237 Less than a minute