Guntur : Foundation stone laying ceremonies were held for various development works in Guntur West constituency. CC roads to be constructed in 37th Division at a cost of Rs. 2 crore 50 lakhs
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. ఈమేరకు 37వ డివిజన్ లో 2 కోట్ల 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్లు ,డ్రైన్లు, కల్వర్ట్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ కోవెలమూడి రవీంద్ర ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు ఆనం సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా మేయర్, ఎమ్మెల్యే తెలిపారు. దశలవారీగా అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మాధవి, మేయర్ కోవెలమూడి ఆధ్వర్యంలో వేగవంతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆనం సంజీవరెడ్డి తెలిపారు. ఆదర్శవంతమైన నగరంగా గుంటూరును తీర్చి దిద్ది ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.