- విజయవాడ బుడమేరు వరద బాధితుల సహాయార్థం గుంటూరు నగర పాలక సంస్థ వెచ్చించిన 9.24 కోట్ల విలువైన నిధుల అవినీతి పై నగర పాలక సంస్థలోని మేయర్ ఛాంబర్ మీడియా సమావేశం మేయర్ మాట్లాడుతూ రేపు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నగర పాలక సంస్థలోని తమ చాంబర్ నందు తాను అందుబాటులో ఉంటానని లెక్క చెప్పాలని అన్నారు
- బుడమేరు వరదల సమయంలో అన్ని మున్సిపాలిటీలు,కార్పొరేషన్లు సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో,కమిషనర్ తమ దృష్టికి తీసుకురాగా వరద బాధితులకు అండగా ఉండాలని కమిషనర్ తానే సూచించమన్నారు.
- వరద బాధితుల సహాయార్థం గుంటూరు నగర పాలక సంస్థ వెచ్చించిన 9.24 కోట్ల నిధులపై కౌన్సిల్ సమావేశం నందు గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ గారు సరైన సమాధానం ఇవ్వకుండా,సభ నుండి వాకౌట్ చేశారు .
- బుడమేరువాగు ఘటనపై చర్చించేందుకు సమావేశం నిర్వహించాలని కమిషనర్ గారికి సూచించిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి సమావేశం జరగకుండా కాలయాపన చేస్తున్నారు.
- గుంటూరు నగర పాలక సంస్థలో జరిగిన ఈ అవినీతిపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేయుట జరిగిందని,దీనిపై సీఎం డిప్యూటీ సీఎం స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు.
- గత నెల డిసెంబర్ 20వ తారీఖున కౌన్సిల్ సమావేశం జరిగిందని అప్పటినుండి ఖర్చుల వివరాలు వెల్లడించాలని కమిషనర్ ను అడిగినప్పటికీ ఆయన స్పందించట్లేదన్నారు.
- నగర ప్రజల టాక్స్ ల ద్వారా సేకరించిన నిధులు గుంటూరు నగర అభివృద్ధికి వెచ్చించాలని,సదరు నిధులు గోల్మాల్ అవుతుంటే వాటిపై ప్రశ్నించే హక్కు తమకు ఉందన్నారు.
- 9.24 కోట్ల నిధులు కమిషనర్ అనధికారుల ఖాతాల్లోకి జమయినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
- ఈ ఘటనపై భవిష్యత్తులో న్యాయపోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నామన్నారు.
- బుడమేరు వరదల సహాయార్థం గుంటూరు నగర పాలక సంస్థ వెచ్చించిన 9.24కోట్ల రూపాయలకు లెక్కలను నాకు పూర్తిగా చూపించవలసిన బాధ్యత కమిషనర్ కి ఉన్నది అన్నారు.
2,276 1 minute read