Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకామారెడ్డికృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్గుంటూరు

GUNTUR: GST తగ్గింపుతో ప్రజల ఆరోగ్యానికి ఊరట

GST AWARENESS MEETING IN GUNTUR

జి.ఎస్.టి తగ్గింపుతో ప్రజల ఆరోగ్యానికి ఊరట లభించిందని జాయింట్ కలెక్టర్ జి. అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. “సూపర్ జి.ఎస్టి – సూపర్ సేవింగ్స్” కార్యక్రమంలో భాగంగా లలిత సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ – స్పెషల్ క్లీనిక్ లో గురువారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. మందుల ధరలు తగ్గించడం, ఆరోగ్య సేవలు చవక కావడం, ప్రతి కుటుంబం భీమా సౌకర్యం పొందేలా చేయడం జీఎస్టీ 2.0 సంస్కరణలలో కలిగిన ప్రయోజనాలని చెప్పారు. ప్రాణరక్షక మందుల ధరలు తగ్గుతాయని, ఆరోగ్య జీవిత భీమా తీసుకోవడం సులభం అవుతుందన్నారు. ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్నెస్ అవగాహన పెరుగుతుందన్నారు. పాత జీఎస్టీ సాధారణ మందులు, టెస్టింగ్ కిట్లు, ప్రాణరక్షక మందులుపై 12 శాతం, వైద్య ఆక్సిజన్ పై 18 శాతం ఉండగా కొత్త జీఎస్టీలో ప్రాణరక్షక మందులుపై సున్నా శాతం, మిగిలిన వాటిపై 5 శాతంకు తగ్గించడం జరిగిందని తెలిపారు. క్యాన్సర్, షుగర్, బీపీ, గుండె సమస్యలు, మూత్రపిండ వ్యాధులు వంటి దీర్ఘకాలిక రోగాల చికిత్సకు ఉపయోగించే మందులపై జీఎస్టీ 12% నుండి 5%కి తగ్గిందని., అరుదైన వ్యాధులు, అవయవ మార్పిడి వంటి చికిత్సల్లో ఉపయోగించే 36 ప్రాణరక్షక మందులుపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయడం జరిగిందని వివరించారు. థర్మామీటర్లు, మెడికల్ కిట్లు వంటి వస్తువులపైనా పన్ను తగ్గిందన్నారు. బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి సేవలు 12% స్థానంలో 5% పన్నుతో – ఆస్పత్రుల చికిత్సా ఖర్చు ఒక్కో రోగికి రూ.30 నుండి 50 వరకు తగ్గుతుందన్నారు. జీవిత భీమా, ఆరోగ్య, కుటుంబ బీమాపై 18 శాతం నుండి సున్నా శాతంకు., వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ కిట్లు, బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి, ఔషధ తయారీ (జాబ్ వర్క్), కంటి సంరక్షణ (చష్మాలు, లెన్సులు) 12 శాతం నుండి 5 శాతంకు తగ్గిందన్నారు. జిమ్, ఫిట్నెస్ సెంటర్లుపై 18 శాతం నుండి 5 శాతంకు, డ్రైఫ్రూట్స్, డయాబెటిక్ ఫుడ్స్ పై 12 శాతం నుండి 5 శాతంకు తగ్గిందన్నారు. పరీక్షలు లభ్యం వలన ఆస్పత్రులలో మొత్తం ఖర్చులో 30 నుండి 40 శాతం పరికరాలపైనే ఉంటుందని వీటిపైజీఎస్టీ 2.0లో పన్ను 18% నుండి 5%కి తగ్గడం వలన ఆక్సిజన్ సిలిండర్లు, కన్సెంట్రేటర్లు, సర్జికల్ గ్లవ్స్, బ్యాండేజీలు, థర్మామీటర్లు, గ్లూకోమీటర్లు, కోవిడ్, డెంగ్యూ, మలేరియా పరీక్షా కిట్లు తక్కువ ధరకు లభిస్తాయని వివరించారు. ఆస్పత్రులకు ప్రతి రూ.1 కోటి విలువ పరికరాలపై రూ.6 నుండి 8 లక్షలు ఆదా అవుతుందని, రక్త పరీక్షలు రూ.2 వందలు స్థానంలో రూ.150కీ లభిస్తాయని పేర్కొన్నారు. కంటి అద్దాలు, లెన్సులు, ఫ్రేమ్ లు, కంటి ఆపరేషన్ పరికరాలపై 12 శాతం నుండి 5 శాతంకు, కంటి పరీక్ష సేవలు 18 నుండి 5 శాతంకు, బ్రెయిల్ పుస్తకాలు, దృష్టి దోషితుల పరికరాలపై ఉన్న 5 శాతంను పూర్తిగా రద్దు చేసి సున్నా శాతం చేయడం జరిగిందని చెప్పారు. ఔషధ, పరీక్షా రంగాల వ్యయాలు తగ్గుతాయని, దేశీయ ఉత్పత్తికి ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. ఆఆయుష్ విభాగంలో ఆయుర్వేద, హోమియో, యునాని మందులు, హెర్బల్ ఉత్పత్తులు 12 శాతం నుండి 5 శాతంకు., యోగా, సిద్ధ చికిత్సా కేంద్రాలు 18 నుండి సున్నా శాతంకు, పంచకర్మ చికిత్సలు 18 శాతం నుండి 5 శాతంకు తగ్గిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాదికారి కె. విజయ లక్ష్మి, డా.ఎన్.టి.ఆర్. వైద్యసేవా జిల్లా సమన్వయకర్త డా.సి.హెచ్.విజయ్ ప్రకాష్, లలిత హాస్పిటల్ మానేజింగ్ డైరెక్టర్ పి.వి.రాఘవ శర్మ, విజయ, ఇన్సూరెన్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button