గుంటూరు ఏ.సి. కాలేజీ లో నిర్వహించిన జీఎస్టీ ఎగ్జిబిషన్‌ను గుంటూరు పశ్చిమ నియోజక వర్గ శాసన సభ్యురాలు గళ్ళ మాధవి, గుంటూరు తూర్పు నియోజక వర్గ శాసన సభ్యులు నసీర్ అహ్మద్, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, నగర పాలక కమిషనర్ పులి.శినివాసులు, సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జీఎస్టీ జాయింట్ కమిషనర్ గీతా మాధురితో కలసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ప్రజా ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ విధానంతో వ్యాపార, వ్యవసాయ రంగాలకు కొత్త ఊపిరి లభించిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్ను భారం తగ్గించే దిశగా తీసుకున్న సూపర్ జీఎస్టీ అన్నీ వర్గాలకు ఉపయోగకరంగా వుందన్నారు. వ్యవసాయ రంగంలో ఉపయోగించే యంత్ర పరికరాలపై జీఎస్టీ గణనీయంగా తగ్గడం రైతులకు పెద్ద ఊరటని అన్నారు. మధ్యతరగతి ప్రజలకు ఈ జీఎస్టీ సంస్కరణలు ఒక వరంగా నిలుస్తున్నాయని వారు పేర్కొన్నారు. ప్రజల జీవితంలో అవసరమైన అన్ని రంగాలలోనూ జీఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గడంతో వినియోగదారులు దాని ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. తక్కువ పన్నులతో అందుబాటులోకి వస్తున్న ఉత్పత్తులను పరిశీలించి, దేశ ఆర్థిక ప్రగతికి భాగస్వాములుగా మారాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చిన్న మద్య తరగతి వ్యాపార సంస్ధలకు కూడా తక్కువ పన్ను రేట్లతో తమ వ్యాపారాలను మరింత విస్తరించుకొనే అవకాశం కలదన్నారు. అలాగే అత్యవసర మందుల ఉత్పత్తులపై, గృహ వినియోగ వస్తువులపై విద్యుత్ పరికరాలు, అవసరమైన దిన చర్యలో వినియోగించే వస్తువులపై పన్ను తగ్గించటం ద్వారా సాధారణ ప్రజలు జీవ విధానంపై ప్రభావం తగ్గుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్నసూపర్ జీఎస్టీ సదుపాయాలను ప్రతి కుటుంబం తెలుసుకొని ఉపయోగించుకోవాలి అని అన్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో గుంటూరుకు చెందిన పలు హోమ్ అప్లయెన్సెస్ కంపెనీలు, ఎలక్ట్రానిక్స్, ప్రతినిధులు ఆటోమొబైల్ రంగాలు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. పౌరులు, విద్యార్థులు, వ్యాపార వేత్తలు భారీ సంఖ్యలో హాజరై ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు జీఎస్టీ 2.0లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు, తక్కువ పన్నుల విధానాలు, వినియోగదారుల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు.
1,050 1 minute read