గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా వకుల్ జిందాల్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐపీఎస్ ల బదిలీల్లో భాగంగా గుంటూరు జిల్లా ఎస్పీగా ఆయన నియమితులయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం నూతన ఎస్పీగా వకుల్ జిందాల్ బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీకి జిల్లాలోని పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో రౌడీయిజాన్ని అణిచివేయడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాష్ట్రంలో కెల్లా గుంటూరు జిల్లా అత్యంత ప్రాముఖ్యమైందని చెప్పారు. గుంటూరు జిల్లాలో ఎస్పీగా పని చేసేందుకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఆశించిన మేరకు తామ విధులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు.
235 Less than a minute