
కొల్లి శారద హోల్ సేల్ కూరగాయల మార్కెట్ విషయంలో హైకోర్టు స్పష్టత ఇచ్చిందని కమీషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు మేరకు అన్నపూర్ణ కాంప్లెక్స్ లో అక్రమంగా వ్యాపారం చేస్తున్న వారిని బుధవారం ఖాళీ చేయించడం జరుగుతుందని ప్రకటించారు. ఈమేరకు కమీషనర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.83 లక్షలు ఆదాయం ఉన్న మార్కెట్ ను 6 కోట్ల రూపాయలకు పెంచడం జరిగిందని చెప్పారు. 81 షాపులకు పారదర్శకంగా వేలం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
అయితే అన్నపూర్ణా కాంప్లెక్స్, సర్వీస్ రోడ్లలో అక్రమంగా వ్యాపారం చేస్తున్నారని పేర్కొన్నారు. 3 కోట్ల రూపాయల బకాయి వుండి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదు కనుక డిఫాల్టర్ గా ప్రకటించామని అన్నారు. ఈ వివరాలను హైకోర్టుకు విన్నవించడంతో తక్షణమే ఖాళీ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని కమీషనర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కూరగాయల విక్రయాలు చేసే వ్యాపారులు కొల్లి శారద హోల్ సేల్ మార్కెట్ ద్వారానే వ్యాపారం చేసుకోవాలని సూచించారు.







