
జిల్లాలో నేరాల నియంత్రణకు నిఘాను మరింత పటిష్టం చేస్తామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లాలో చోరీకి గురైన 250 సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు.
ఈ వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. రికవరీ చేసిన సెల్ ఫోన్ ల విలువ సుమారు 50 లక్షలు ఉంటుంది.సెల్ ఫోన్ చోరీ మిస్ అయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.2 సంవత్సరాల్లో 1300 సెల్ ఫోన్లు రికవరీ చేసాం.వీటి విలువ 6 కోట్ల 80 లక్షల ఉంటుంది. సెల్ ఫోన్లు చోరీ చేసి నేరాలకు పాల్పడుతున్నారు.సెల్ ఫోన్ పోయిన వెంటనే నెంబర్ ను డియాక్టివేట్ చేయాలి. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.







