
గుంటూరు:అక్టోబర్:22:-నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలనే తపనతో పరితపిస్తున్నారు. ఈ వేగవంతమైన ప్రపంచంలో కుటుంబ సభ్యులు తమ వృద్ధులను చూసుకునే సమయం లేకపోతున్న సందర్భంలో, వారికి అండగా నిలుస్తోంది అయాన్ ఫిజియోథెరపీ & రిహాబిలిటేషన్ ఓల్డ్ ఏజ్ హోమ్.గుంటూరులోని గుజ్జనగుండ్ల సెంటర్ నాలుగో లైన్‌లో ఈ సంస్థను నిర్వహిస్తున్నది డాక్టర్ ఎస్.కే. మున్నీర్ (BPT, యోగా ట్రైన్డ్). తక్కువ ఖర్చుతో, ఉన్నత ప్రమాణాలతో సేవలందిస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.డాక్టర్ మున్నీర్ మాట్లాడుతూ —“వృద్ధులకు మనసుకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణంలో సేవలందించడం మా ధ్యేయం. ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది కేవలం నివాస స్థలం కాదు, కుటుంబ వాతావరణాన్ని కల్పించే స్నేహపూర్వక గృహం కావాలి. ఆ లక్ష్యంతోనే ఈ సంస్థను నడుపుతున్నాం” అని తెలిపారు.
ప్రత్యేకతలు:
- పక్షవాతం, బెడ్ పేషెంట్లు, యాక్సిడెంట్ బాధితులకు నిపుణులైన ఫిజియోథెరపిస్టులచే వైద్య సేవలు
- అనుభవం కలిగిన ఆయాల ద్వారా నిత్యసేవలు
- పరిశుభ్రమైన గదులు, రుచికరమైన ఆహారం — ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం
- 24 గంటల అంబులెన్స్ సౌకర్యం, టీవీ, వైఫై, వీడియో కాల్ సదుపాయం
- అవసరమైతే వెంటనే వైద్య సేవలు అందించేందుకు నిరంతర పర్యవేక్షణ
- డాక్టర్ మున్నీర్ తెలిపారు —
- “గుంటూరులోనే ఈ స్థాయిలో సేవలు అందించడం గర్వకారణం. మా సేవలను నగర ప్రజలే కాకుండా జిల్లా వ్యాప్తంగా వృద్ధులు, వారి కుటుంబాలు ఉపయోగించుకోవాలి” అని అన్నారు.ఇంకా ప్రతి శుక్రవారం ఉచిత కన్సల్టేషన్, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.📞 9010743269
 
  
 






