chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

గుంటూరులో వర్షం ప్రభావం — లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: నగర కమిషనర్ పులి శ్రీనివాసులు

గుంటూరు, అక్టోబర్ 6: నగరంలో సోమవారం నుండి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. పలు ప్రాంతాల్లో వరదనీరు చేరే అవకాశముండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఇంజినీరింగ్ శాఖ అధికారులకు మోటార్లను సిద్ధంగా ఉంచి, వర్షపు నీటిని వెంటనే బైల్ అవుట్ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ఆదేశించారు. ముఖ్యంగా కంకరగుంట ఆర్యూబి వద్ద, రింగ్ రోడ్, చుట్టగుంట సెంటర్ పరిసరాల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని, కల్వర్ట్‌ల వద్ద ఏర్పాటు చేసిన మెష్‌లను చెత్తతో బ్లాక్ కాకుండా తరచూ పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత డీఈఈలు మరియు ప్రజారోగ్య అధికారులకు ఆదేశాలిచ్చారు.

వర్షాల నేపథ్యంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, ప్రజారోగ్య శాఖలతో పాటు వార్డు సచివాలయ కార్యదర్శులు కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో త్రాగునీటి సరఫరాలో అంతరాయం రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఎఐఈలకు సూచించారు. వర్షాల వల్ల చెట్లు కూలినచో వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలని హెచ్‌డీహెచ్ అధికారిని ఆదేశించారు.

ఇక ప్రజలు త్రాగునీటిని కాచి చల్లార్చి త్రాగాలని సూచించిన కమిషనర్, వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా 24 గంటల జిఎంసి కాల్ సెంటర్ 08632-345103 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker