వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా చేసిన వ్యాఖ్యలను కన్యకా పరమేశ్వరి ఆలయం కమిటీ ప్రతినిధులు ఖండించారు. ఈమేరకు కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, కోట శేషగిరిరావు మీడియాతో మాట్లాడారు. కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని భ్రస్టు పట్టించేందుకు ఆరంభించింది మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అని చెప్పారు. 2024 లో 54 మందితో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి కోటి 15 లక్షలతో నవరాత్రి ఉత్సవాలు చేశామని తెలిపారు.
జిఎస్టితో సహా 12 లక్షలు అప్పు చేయాల్సి వచ్చిందన్నారు. ప్రతి రూపాయి ఖర్చుకి మా దగ్గర లెక్క ఉంది. దసరా నవరాత్రుల ఉత్సవ కమిటీలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు. నూరి ఫాతిమా చేస్తున్న ఆరోపణలు నిరూపించాలి.నిరూపించలేని పక్షంలో రాజకీయాల నుండి పూర్తిగా వైదొలగాలని సూచించారు. ఎమ్మెల్యే నజీర్ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వారు వెల్లడించారు. ఈ సమావేశంలో దసరా ఉత్సవ కమిటీ ప్రతినిధులు కోగంటి సత్యం, చంద్రిక, కాకుమారి శ్రీనివాసరావు, వేమేంద్ర గుప్తా, సులోచన, అంకారావు, నరేంద్ర, శీను తదితరులు పాల్గొన్నారు.