chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR LOCAL NEWS :గుంటూరు నగరంలో తాగునీటి సరఫరాకు అంతరాయం-లీకేజీ కారణంగా ఫిల్టరేషన్ ప్లాంట్ నిలిపివేత

గుంటూరు నగర ప్రజలకు నగరపాలక సంస్థ కీలక సమాచారం విడుదల చేసింది. తక్కెళ్ళపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుండి నగరానికి నీటిని పంపింగ్ చేసే ప్రధాన లైనులో సీతానగర్ ప్రాంతంలో లీకేజీ ఏర్పడటంతో, తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు.

ఈ లీకేజీని సరిచేసే క్రమంలో ఫిబ్రవరి 9వ తేదీ (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి మరమ్మతు పనులు ప్రారంభించనున్నట్లు నగరపాలక సంస్థ వెల్లడించింది. ఈ పనుల కారణంగా ఫిల్టరేషన్ ప్లాంట్‌ను పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుందని అధికారులు తెలిపారు.

తాగునీటి అంతరాయం వివరాలు:

  • ఫిబ్రవరి 9 (సోమవారం) సాయంత్రం నుంచి
  • ఫిబ్రవరి 10 (మంగళవారం) వరకు తాగునీటి సరఫరా నిలిచిపోతుంది.
  • మంగళవారం సాయంత్రం నుంచి పాక్షికంగా సరఫరా ప్రారంభమవుతుంది.
  • బుధవారం ఉదయం నుంచి యథావిధిగా తాగునీటి సరఫరా కొనసాగనుంది.

నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు:

తక్కెళ్ళపాడు హెడ్ వాటర్ వర్క్స్ పరిధిలోని
నెహ్రునగర్, శారద కాలనీ, వసంతరాయపురం, రాజీవ్ గాంధీ నగర్, హనుమయ్య నగర్, స్తంబాలగరువు, శ్యామల నగర్, గుజ్జనగుండ్ల, కోర్ట్ కాంపౌండ్, ఏటి అగ్రహారం, తారకరామనగర్ ప్రాంతాలతో పాటు,
నల్లచెరువు, బిఆర్ స్టేడియం, శ్రీనివాసరావు తోట రిజర్వాయర్ల పరిధిలో కూడా త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని నగరపాలక సంస్థ మెయిల్ ద్వారా జారీ చేసిన ప్రెస్ నోట్‌లో స్పష్టం చేసింది.guntur 3

నగర ప్రజలకు విజ్ఞప్తి:

ఈ అసౌకర్యాన్ని గమనించిన నగర ప్రజలు ముందుగానే అవసరమైన నీటిని నిల్వ చేసుకోవాలని అలాగే మరమ్మతు పనుల్లో నగరపాలక సంస్థకు సహకరించాలని గుంటూరు మున్సిపల్ కమిషనర్ కె. మయూర్ అశోక్ కోరారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker