
అనుమతించిన ప్లాన్ కి భిన్నంగా లేదా అనధికారికంగా 2018 ఆగస్ట్ 31వ తేదీలోపు నిర్మాణం చేసి, క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసి, పరిష్కారం చేసుకోని అర్జీదారులు తమ ఆర్జీల పరిష్కారంకు ఈ ఏడాది మార్చి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని, సదరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2018 ఆగస్ట్ 31వ తేదీలోపు ప్లాన్ కి భిన్నంగా లేదా అనధికారికంగా నిర్మాణం చేసుకున్న భవనాల క్రమబద్దీకరణకు 2019జనవరి 1న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, సదరు ఉత్తర్వుల మేరకు అర్జీలు దాఖలు చేసుకున్నవారి ఆర్జీల పరిష్కారానికి తొలుత 2024డిశంబర్ 31గా ఉత్తర్వులు జారీ చేశారని, ప్రస్తుతం సదరు గడువుని ఈ ఏడాది మార్చి 31 వరకు పెంచారని తెలిపారు. కనుక అర్జీదారులు చెల్లించాల్సిన అపరాధ రుసుం, దస్తావేజులను ఆన్లైన్ లో అప్ లోడ్ చేసుకోవాలన్నారు. లేని యెడల సదరు నిర్మాణాలను నిరంతర నేరంగా పరిగణించి చట్ట ప్రకారం చర్యలు, నిర్మాణం తొలగించడం, ఎట్టి అదనపు భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయకపోవడం, క్రమబద్ధీకరణ లేదా తొలగించు వరకు ప్రస్తుతం ఉన్న భవనానికి ఇంటి పన్నుపై 25 నుండి 100 శాతం వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.







