అన్నక్యాంటీన్లలో టిఫిన్, మధ్యాహ్నం, భోజనాన్ని ప్రభుత్వ నిర్దేశిత సమయంలో అందుబాటులో ఉండేలా చూడాలని, శుక్రవారం నుండే మార్చిన సమయాన్ని పాటించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులను, అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. గురువారం చుట్టగుంట సెంటర్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి అన్న క్యాంటీన్లలో ఆహార సమయాలపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లలో ఉదయం టిఫిన్ 7 నుండి 9 గంటల వరకు, మధ్యాహ్నం భోజనం 12 నుండి 2:30 గంటల వరకు, రాత్రి డిన్నర్ ని 7 గంటల నుండి 8:30 గంటల వరకు అందించాలన్నారు. అలాగే పేద ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం అందించడానికి ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఆయా క్యాంటీన్ల వద్ద లైట్లు, త్రాగునీటి ఏర్పాట్లు, మొక్కలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏమైనా మరమత్తులు ఉంటే ఎప్పటికప్పుడు చేయాలని, క్యాంటీన్ల పరిశీలనకు నోడల్ అధికారులను కూడా నియమించామని తెలిపారు. అక్షయ పాత్ర సిబ్బంది కూడా క్యాంటీన్ పరిశుభ్రతలో భాధ్యతగా ఉండాలన్నారు.
235 Less than a minute