
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 30వేల మంది పట్టబద్రులు ఓటర్లుగా నమోదు కావడం జరిగిందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై పార్టీ నేతలతో గురువారం తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. బూత్ లెవెల్‌లో ప్రతి ఓటరు దగ్గరకు పార్టీ నేతలు తప్పనిసరిగా వెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థిని ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు కోసం సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల కు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని ఎమ్మెల్యే మాధవి స్పష్టం చేశారు.







