
అంగన్వాడీలు, డ్వాక్రా మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని టిడిపి మహిళా విభాగం నేతలు ఆచంటి సునీత,జానీ బేగం తెలిపారు. ఈమేరకు ఆలపాటి మాధవితో కలిసి గురువారం వారు మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచడం తోపాటు డ్వాక్రా మహిళల ఆర్ధికాభివృద్ధి కోసం గతంలో టిడిపి ప్రభుత్వం విశేషమైన కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపుకు మహిళలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. రాజకీయాల్లో అనుభవం కలిగిన ఆలపాటి గెలుపు రాష్టానికి, మహిళలకు ఎంతో అవసరమని వారు వెల్లడించారు.







