
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఈనెల 10వ తేదీన నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టర్ కార్యాలయాలకు ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీ అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేస్తారు. నామినేషన్ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కేఎస్ లక్ష్మణరావు సూచించారు. రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా ఇప్పటివరకు పిడిఎఫ్ ఎమ్మెల్సీలు పనిచేయడం జరిగిందని చెప్పారు. పట్టభద్రుల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా శాసనమండలిలో తాను కృషి చేస్తానని తెలిపారు. తన గెలుపుకు అన్ని వర్గాలు సహకరించాలని లక్ష్మణరావు పేర్కొన్నారు.







