
ఎస్సీ వర్గీకరణ విషయంలో తెలంగాణా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం శుభ పరిణామం అని మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. వర్గీకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత వెనుకబడిన పంబ, నేతగాని కుటుంబాలను ముందు వరుసలో ఉంచాలని సూచించారు. వర్గీకరణ కోసం గత 70 ఏళ్ల నుండి ఎన్నో కష్టాలు అనుభవించాలని చెప్పారు. మందకృష్ణ చేసిన పోరాట ఫలితాలను మాదిగలు త్వరలోనే అనుభవించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. తెలంగాణా ప్రభుత్వం తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.







