ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ పెండింగ్ పోర్షన్ పనులు వెంటనే ప్రారంభించాలని, విద్యుత్ స్తంభాలను షిఫ్ట్ చేసేలా సమన్వయం చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ ఏటి అగ్రహారం, శాంతి నగర్, లక్ష్మీ నగర్, చుట్టగుంట తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ లో పెండింగ్ రోడ్ పోర్షన్ నిర్మాణంకు తక్షణం చర్యలు తీసుకోవాలని డిఈఈని ఆదేశించారు. రోడ్ కి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాల తరలింపుకు ఆ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. రోడ్ విస్తరణలో ఉన్న కోర్ట్ కేసుల వివరాలతో నివేదిక ఇవ్వాలని ఏసిపిని ఆదేశించారు. కంకరగుంట ఆర్యూబి దగ్గర పీకలవాగుని పరిశీలించి, చుట్టు పక్కల కమర్షియల్ సంస్థల నుండి వ్యర్ధాలు వేయకుండా, వేసే వారి పై అపరాధ రుసుం విధించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు ప్రతి రోజు తమ సచివాలయం పరిధిలో అనధికార కట్టడాలు, ప్లాన్ కి భిన్నంగా నిర్మాణాలు జరగకుండా పర్యవేక్షణ చేయాలని, ఆయా ప్రాంతాలను ప్రతి రోజు డ్రోన్ ద్వారా నేరుగా పరిశీలిస్తామన్నారు. తమ పరిశీలనలో అనధికార కట్టడాలు గుర్తిస్తే సంబందిత కార్యదర్శిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏటి అగ్రహారం 3వ లైన్లో ఖాళీ స్థలంలో వ్యర్ధాలు వేయడం గమనించి, సదరు యజమానికి శుభ్రం చేసుకోవాలని నోటీసులు ఇవ్వాలని, ఇంటింటి చెత్త నూరు శాతం చేస్తే వ్యర్ధాలను రోడ్ల మీద, ఖాళీ స్థలాల్లో వేయడం ఉండదని శానిటేషన్ కార్యదర్శులను ఆదేశించారు. అనంతరం 4వ లైన్ లో డ్రైన్ ని పరిశీలించి, మెయిన్ డ్రైన్ లోకి అనుసంధానం చేయడానికి చర్యలు తీసుకోవాలని డిఈఈని ఆదేశించారు.
233 1 minute read