
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళల భద్రతను కాపాడడమే లక్ష్యంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మరొకసారి తన కర్తవ్య నిబద్ధతను చాటుకున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గములోని రెడ్డి కాలేజీలో గంజాయి సేవిస్తూ మహిళలు, యువతులను వేధిస్తున్న ఆకతాయిలపై ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఉక్కుపాదం మోపారు. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే గళ్ళా మాధవికి స్థానిక మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గళ్ళా మాధవి తక్షణమే స్పందించి, స్వయంగా రెడ్డి కాలేజీ వద్దకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అక్కడే పోలీసు ఉన్నతాధికారులను పిలిపించి ముగ్గురు ఆకతాయిలను అదుపులోకి తీసుకునేలా చేసి, విద్యార్థులు, మహిళలు భయాందోళనలలో ఉండకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అదేవిధంగా నగరంలో గంజాయి వ్యసనం పెరుగుతున్న దృష్ట్యా పెట్రోలింగ్‌ను మరింతగా పెంచాలని, గంజాయి అమ్మకందారులను గుర్తించి కట్టడి చేయాలని, ఇలాంటి సంఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా సమగ్ర పర్యవేక్షణ చేయాలని పోలీసు విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజల భద్రత, యువత భవిష్యత్తు నాశనం చేయబోయే గంజాయి మాఫియాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము. మహిళలు, యువతులు భయపడకుండా జీవించే వాతావరణాన్ని కల్పించడం నా ప్రథమ కర్తవ్యం” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టి, ఆకతాయితనానికి చెక్ పెట్టే కఠిన చర్యలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి చర్యలను స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.








