గుంటూరు నగరంపాలెం లోని హజరత్ కాలే మస్తాన్ షా అవులియా 133వ ఉరుసు మహోత్సవాలు ఈనెల 17వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. పలు విశేష పూజలతో ఈనెల 21వ తేదీ వరకు ఉరుసు మహోత్సవాలు వైభవంగా కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా 17వ తేదీ తెల్లవారుజామున చాందిని అలంకరణ, రాత్రి గంధం ఊరేగింపు జరగనుంది. అదేవిధంగా 18వ తేదీ గంధం పంచుట, దీపారాధన జరుగుతుంది. 19వ తేదీ గ్యార్మీ షరీఫ్ ఖురాన్ పఠనం, ప్రసాదం పంచడం నిర్వహిస్తారు. 20వ తేదీ ఫకీర్లకు చద్దరులు పంచడం జరుగుతుంది. 21వ తేదీ బాబా వారు ఆశీనులైన కుర్చీని యదా స్థానంలో ఉంచుతారు. ఉరుసు మహోత్సవానికి సంబంధించిన పోస్టర్లను దర్గా ప్రతినిధులు రావి రామ్మోహన్ రావు, డూండేశ్వరి, హరికృష్ణ, మస్తాన్ విడుదల చేశారు. దాదాపు లక్ష మంది భక్తులు ఉరుసు మహోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Read Next
13 hours ago
మావుళ్ళమ్మ అమ్మవారికి శ్రావణ మాస సారి సమర్పణ||Sari Offering to Mavullamma Goddess in Shravan Month
13 hours ago
తాడేపల్లిలో ప్రాణాల మీద శాపంగా కరెంట్ స్తంభం||Electric Pole Becomes Life Threat in Tadepalli
13 hours ago
పొగాకు కొనుగోలు కోసం రైతుల ధర్నా పిలుపు||Farmers Call Protest for Fair Tobacco Procurement
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
Related Articles
నరసరావుపేటలో వర్ష బాధితులకు అండగా ఎమ్మెల్యే చదలవాడ||MLA Chadalawada Responds Swiftly to Rain Havoc in Narasaraopet
13 hours ago
స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా సిపిఎం ప్రచారం – ఫిరంగిపురంలో కరపత్రాల పంపిణీ||CPM Campaigns Against Smart Meters – Pamphlet Distribution in Phirangipuram
3 days ago
Check Also
Close