గుంటూరు నగరం అమరావతి రాజధానిలో భాగంగా ఉన్నందున అందుకు తగ్గట్టుగా నగరంలో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 1.21 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేయుటకు శంకుస్థాపన చేశామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గలోని 18వ డివిజన్ రామనామక్షేత్రం 5 వ లైన్ నందు 93 లక్షలతో , 24వ డివిజన్ పీకలవాగు పై 28 లక్షల రూపాయలతో సి.సి రోడ్లు, డ్రైన్లు మరియు కల్వర్టులను నిర్మించుటకు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గల్లా మాధవి గారితో కలిసి శంకుస్థాపన చేసి, తదుపరి యన్.టి.ఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని అన్ని వార్డులలో అభివృద్ధి పనులు కుల, మత మరియు పార్టీలకతీతంగా ప్రాధాన్యతా క్రమంలో నిర్వహించుటకు చర్యలు తీసుకున్నామన్నారు. దీనిలో భాగంగానే నేడు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 18 మరియు 24 డివిజన్లలో 1.21 కోట్ల రూపాయలతో, స్థానిక ప్రజా ప్రతినిధుల ప్రతిపాదనలతో సి.సి రోడ్లు, డ్రైన్లు మరియు కల్వర్టులను నిర్మించుటకు శంకుస్థాపన చేశామన్నారు. గుంటూరు నగరం అమరావతి రాజధానిలో భాగంగా ఉన్నందున గుంటూరు నగరాన్ని పూర్తి స్తాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నగరాభివృద్దికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలియచేశారు. గుంటూరు నగరాభివ్రుద్దికి స్థానిక ప్రజా ప్రతినిధులను కలుపుకొని వెళ్తామని, వారి అభిప్రాయాల మేరకు అభివృద్ధి పనులు నిర్వహిస్తామని తెలియచేశారు. ఈ సందర్భంగా యం.యల్.ఏ గారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నామని, స్థానిక కార్పోరేటర్ల అభిప్రాయాల మేరకు, వారు ప్రతిపాదించిన ప్రాంతాలలో ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అవసరమైన ప్రాంతాలలో డ్రైన్లు, రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో త్రాగు నీరు మరియు పారిశుధ్య సమస్యలు లేకుండా నగర పాలక సంస్థ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. అనంతరం యన్.టి.ఆర్ భరోసా క్రింద ప్రభుతం అందిస్తున్న పెన్షన్లను వృద్దులు, వితంతు మహిళలు మరియు వికలాంగులకు అందజేశారు. సదరు కార్యక్రమంలో కార్పొరేటర్ నిమ్మల వెంకట రమణ, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, సచివాలయాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
230 1 minute read