Guntur News : గుంటూరు మిడికల్ కాలేజ్ 99 బ్యాచ్ విద్యార్థులు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు నందు ఆర్థోపెడిక్ విభాగానికి చెందిన నూతనంగా డాక్టర్ రమణ
గుంటూరు మిడికల్ కాలేజ్ 99 బ్యాచ్ విద్యార్థులు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు నందు ఆర్థోపెడిక్ విభాగానికి చెందిన నూతనంగా డాక్టర్ రమణ ఎస్ ఎస్ వి గారి ఏర్పాటు చేయబడ్డ ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్ కు గాను ఒకటిన్నర లక్ష వ్యయంతో కూడిన ఆపరేషన్ థియేటర్ ఆర్థోపెడిక్ ఇన్స్ట్రుమెంట్స్ ను వితరణ చేయడం జరిగింది.దీనితోపాటు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ నుండి లక్ష రూపాయలు వ్యయంతో ఆపరేషన్ థియేటర్ పరికరాలను సమకూర్చడం జరిగింది దీనికి కావలసిన మౌలిక వసతులను ఏర్పాటు చేసి ఇకమీద రోడ్ యాక్సిడెంట్ మరియు ట్రామా సర్వీసుల కోసం జిజిహెచ్కి వచ్చే రోగులకు 24 గంటలు ఏడు రోజులు పాటు 365 రోజుల ఏర్పాటు అందుబాటులో ఉండేలాగా ఒక ఆర్థోపెడిక్ ట్రామా ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్ ని సిద్ధం చేయడమైనది ఈ ఆపరేషన్ థియేటర్ రేపటి నుంచి స్టెర్లైజేషన్ పూర్తిచేసుకుని రోగులకు సేవలు అందించుటకు సిద్ధంగా ఉందని డాక్టర్ రమణ ఎస్ ఎస్ వి సూపర్డెంట్ జిహెచ్ గుంటూర్ మీడియా ముఖంగా తెలియజేయడమైనది.ఈ కార్యక్రమంలో 99 బ్యాచ్ జిఎంసి స్టూడెంట్స్, ఆర్థోపెడిక్ ఫ్యాకల్టీ , విభాగధిపతి డాక్టర్ నారాయణరావు గారు, మత్తు విభాగధిపతి డాక్టర్ పోలయ్య గారు, ఎన్టీఆర్ వైద్య సేవ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అనిల్ గారు, నర్సింగ్ సిబ్బంది మరియు ఆపరేషన్ థియేటర్ సిబ్బంది పాల్గొన్నారు