Oxygen concentrator given to girl suffering from rare heart disease:అరుదైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాలికకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందజేత
సైనోటిక్ కంజెనిటల్ హార్ట్ డిసీస్ అనే అరుదైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కొలకలూరుకు చెందిన దీప్తి అనే పాపకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందజేత, తెనాలి వాస్తవ్యురాలు గుంటూరు పట్టణమునందు ప్రముఖ హాస్పిటల్ నందు గుండె సంబంధిత డాక్టర్ గా సేవలందిస్తున్న డాక్టర్ పర్వతనేని నాగ శ్రీ హరిత పూజకి ఆక్సిజన్ కంటైనర్ అందజేశారు.
డాక్టర్ హరిత మాట్లాడుతూ సైనోటిక్ కంజెనిటల్ హార్ట్ డిసీస్ అనేది పుట్టుకతో వచ్చే గుండె వ్యాధి, ఈ వ్యాధి వారిలో గుండె యొక్క నిర్మాణ సమస్యలు శరీరానికి సరఫరా అయ్యే ఆక్సిజన్ మొత్తంలో కారణమవుతాయి ఫలితంగా చర్మం నీలి రంగలో మారడం మరియు వేగంగా శ్వాస తీసుకోవడం వేగంగా హృదయ స్పందన రేటు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయి ఈ పాపకి శస్త్ర చికిత్స చేసిన ఉపయోగం ఉండదు తన జీవితాంతం ఆక్సిజన్ సహాయంతో ఉండాలని వివరించారు.
వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని డాక్టర్ హరిత గారు అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ సభ్యులతో మాట్లాడి వారి సహాయంతో 70000 విలువగల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందజేయడం జరిగింది అలాగే ఇది చాలా అరుదుగా సంభవించే వ్యాధి ఈ వ్యాధి ఆదిలోనే నిర్ధారిస్తే తగిన వైద్యం ఉంటుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమం నందు/అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ , గుంటూరు
ఫౌండర్ & చైర్మన్ : చెన్న పోతురాజు సెక్రటరీ : మహిపతి రామాంజనేయులు
అడ్వైజర్ కమిటీ చైర్మన్ : వేములపల్లి విఠల్
కార్యవర్గ సభ్యుడు : ఈమని నాంచారయ్య మిత్రులు మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు