
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పని చేసే ప్రజారోగ్య, ఇంజినీరింగ్ కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలపై ఫిర్యాదులు, అర్జీలు అందించేందుకు ఈ నెల 27న (గురువారం) సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల వారీగా కార్మికుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారంకు గ్రీవెన్స్ నిర్వహించనున్నామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో కార్మికులు ప్రధానంగా పిఎఫ్, ఈఎస్ఐ, రుణాలు, ఆప్కాస్ తదితర అంశాలపై, ఉద్యోగులు సమస్యలపై ఎదురవుతున్న అర్జీలను గ్రీవెన్స్ లో అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.







