Guntur News: టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు
Nara Lokesh Birthday
గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. న్యాయవాదుల సమక్షంలో కేక్ కట్ చేసి , మిఠాయి పంపిణీ చేసి లోకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యవర్గ సభ్యుడు, గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కె.వి.కె. సురేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ లోకేష్ బాబు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని.. నిండు ఆయురారోగ్యాలతో పాటు ఉన్నత పదవులు పొందాలన్నారు . ఈ కార్యక్రమంలో రామశేషయ్య, వల్లభనేని శీను, సురేష్, ఎన్డీఏ కూటమి సభ్యులు దాసరి ఉమా , ఎలదండి కోటి, ప్రేమ్ సాయి, అబిద్ అలీ ఖాన్, సుధాకర్, షేక్ సుభాని, షేక్ జిలాని, ఏ నర్మదా , అంబికా భాయి, కళ్యాణి , పెద్ద సంఖ్యలో న్యాయవాదులు అందరూ పాల్గొన్నారు .