
గుంటూరులో ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, మధ్యాహ్నం సమయంలో గ్యాంగ్ వర్క్ లు తప్పనిసరిగా చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ నల్లచెరువు, సంపత్ నగర్, ఇజ్రాయిల్ పేట తదితర ప్రాంతాల్లో అభివృద్ధి, పారిశుధ్య పనులను, తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మైక్రో పాయింట్స్ మేరకు వార్డ్ సచివాలయ పరిధిలో ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. కార్మికులు ఉదయం మస్టర్ అనంతరం మెయిన్ రోడ్లు స్వీపింగ్ చేసి, ఇంటింటి చెత్త సేకరణ చేయాలన్నారు. మధ్యాహ్నం సమయంలో డివిజన్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలను, డ్రైన్లను గ్యాంగ్ వర్క్ ద్వారా శుభ్రం చేయించాలని ఆదేశించారు. నూతన డ్రైన్ నిర్మాణ పనులు జరిగే సమయంలో లెవల్స్ పక్కాగా పాటించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే అభివృద్ధి పనులు జరిగే సమయంలో వర్క్ ఇన్స్పెక్టర్లు, ఎమినిటి కార్యదర్శులు అక్కడే ఉండి పర్యవేక్షణ చేయాలని, పనులు పూర్తి అయిన వెంటనే బిల్లుల చెల్లింపుకు ప్రాసెస్ చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో డిఈఈ మధుసూధన్, ఆర్ఓ సాదిక్ బాష, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.







