
సగరుల ఆరాధ్యదైవమైన భగీరథుడి జయంతిని ఆదివారం తాడేపల్లి పట్టణంలోని బోసు బొమ్మ సెంటర్ సిపిఎం ఆఫీస్ వెనుక శివాలయంలో భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సగరులు భగీరథుడి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా సగరుల నాయకులు మాట్లాడుతూ భువి నుంచి దివికి గంగను తీసుకొచ్చేందుకు భగీరథుడు చేసిన కృషి ప్రశంస నీయమన్నారు. లక్ష్య సాధనలో ఆయన తీరు అందరికీ ఆదర్శనీయమన్నారు. అనంతరం ఉండవల్లి సెంటర్ లో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సగర నాయకులు కంభం సాయిచంద్, కటారి తిరుపతిరావు, పిన్నబ్రోలు నాగరాజు, ధూపాటి వాసు, నక్క వెంకటసుబ్బారావు, గార్లపాటి దుర్గారావు, గండికోట సోమరాజు, కటారి హరిబాబు,వెంకటేశ్వరరావు, ముసలయ్య, వెంకటకృష్ణ, గోపి, సుధీర్, నరసింహ, అరుణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.








