Guntur News: తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ – ఎమ్మెల్యే గల్లా మాధవి
NTR Death Anniversary
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని, ఆయన స్వర్గస్తులయి 29 ఏళ్లు అయినా కూడా వాడవాడలా ఆయనను స్మరించుకుంటూ, పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము అంటే ఎన్టీఆర్ వ్యక్తి కాదని, ఆయన ఓ యుగపురుషుడు అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి కొనియాడారు. శనివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఎమ్మెల్యే గళ్ళ మాధవి ఆధ్వర్యంలో పెద్దయెత్తున నిర్వహించారు. భారీగా అన్నదాన కార్యక్రమాలు, సేవాకార్యక్రమాలు మరియు విగ్రహా ఆవిష్కరణలు జరిగాయి. ఎమ్మెల్యే మాధవి తొలుత తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిత్రపటానికి పార్టీ నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సాయిబాబా రోడ్డు,ముత్యాల రెడ్డి నగర్, గుజ్జనగుండ్ల రోడ్డు, అరండల్ పేట లైబ్రరీ, యస్వీయన్ కాలనీ మెయిన్ రోడ్డు, స్థంబాలగరువు, vip రోడ్డులోని మణి హోటల్ సెంటర్, మిర్చి యార్డు మెయిన్ గేటు, ఎన్జీవో కాలనీలోని విగ్రహాలకు ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. అదేవిధంగా అమరావతి రోడ్డులోని ప్రశాంతి హాస్పటల్ వద్ద, లక్ష్మీపురంలోని కే.యఫ్.సి వద్ద, మారుతినగర్ లోని ఉమెన్స్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద, స్వామి థియేటర్ వద్ద, కంకరగుంట గేట్ వద్ద, నల్లచెరువు 7వ లైన్, శ్రీనివాసరావు పేట 60 అడుగుల రోడ్డు పీర్ల చావిడి వద్ద ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ నేతలు పెద్ద ఎత్తున జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గములోని 23వ డివిజన్ లోని రనగరంపాలెం వద్ద, 20వ డివిజన్ లోని 3బొమ్మల సెంటర్ వద్ద, 44వ డివిజన్ లోని కొరిటీపాడు వద్ద ఎన్టీఆర్ విగ్రహాలను ఎమ్మెల్యే గళ్ళ మాధవి ఆవిష్కరించారు.