BREAKING NEWS – GUNTUR: క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికలు
గుంటూరు నగరపాలక సంస్థలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉత్కంఠగా జరుగుతున్నాయి.
స్టాండింగ్ కమిటీ ఎన్నికల
బరిలో ఆరు పోస్టులకు 12 మంది అభ్యర్థులు నిలిచారు.
ఇందులో మొత్తం
56 మంది కార్పొరేటర్లకు ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఉదయం 10.30 నుంచి 3 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగుతుంది. పోలింగ్ ముగిసిన అనంతరం కౌంటింగ్ చేపడుతారు. సాయంత్రం
4 గంటల కల్లా ఫలితాలు వెలువడే అవకాశం వుంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల బరిలో కార్పొరేటర్లు
అడకా పద్మవతి, అంజలి మర్రి, ఈరంటి వర ప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, గోపి శ్రీని వాస్, దాసరి లక్ష్మీదుర్గ, దూపాటీ వంశీబాబు, నూకవరపు బాలాజీ, ముప్పవరపు భారతి, యాట్ల రవికుమార్, రాజలత బూసి, షేక్ మీరావలిలు ఉన్నారు. ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసి సభ్యులకు చూపుతారు(ఖాళీ బాక్స్). తరువాత బాక్స్ కు తాళం వేస్తారు. ఆ తరువాత ఎన్నిక ప్రక్రియ స్టార్ట్ అయి 3 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 4 గంటలలోపు ఫలితాలను అధి కారులు వెల్లడిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడంచెల విధానంలో పోలీసు బందోబస్తును సిద్దం చేశారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి సభ్యులు వ్యూహ ప్రతి వ్యూహాలు రచించారు. ఇప్పటికే కార్పొరేటర్ లను క్యాంపులకు తరలించారు. క్యాంపుల నుండి నేరుగా ఎన్నికల్లో ఓటు వేసేందుకు గుంటూరుకు చేరుకున్నారు.