బుడమేరు వాగు వరదల వరదల సమయంలో నగరపాలక సంస్థ నిధులను కమిషనర్ పులి శ్రీనివాసులు ఖర్చు చేసిన విషయంపై బహిరంగ చర్చకు రావాలని మేయర్ కావటి మనోహర్ నాయుడు సవాల్ విసిరారు. ఈ మేరకు సోమవారం డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, వైసీపీ కార్పొరేటర్లతో కలిసి కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ తో భేటీ అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ మీడియాతో మాట్లాడారు. నగర కమిషనర్ నిధుల ఖర్చు విషయంలో ఆధారాలు చూపించలేక కేవలం తనకు అధికారం ఉందని, ఇష్టారాజ్యంగా ఏం చేసినా చెల్లుతుంది అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కమిషనర్ చేస్తున్న ఆరోపణలకు తమ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. బహిరంగ చర్చకు ఎప్పుడు పిలిచిన తాము చేసిన ఆరోపణల పైన కూడా ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు. ఆధారాలు చూపలేని పక్షంలో ఎటువంటి చర్యలు తీసుకున్నా కట్టుబడి ఉంటామని వారు వెల్లడించారు.
258 Less than a minute