GUNTUR NEWS: నేషనల్ సైన్స్ డే వేడుకలు – ఆకట్టుకున్న విద్యార్థుల ప్రయోగాలు
NATIONAL SINCE DAY IN GUNTUR
జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. సీ.వీ రామన్ జయంతిని పురస్కరించుకుని పలు పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పట్టాభిపురం, ఏ.టి అగ్రహారంలోని జీకేఆర్ హైస్కూల్స్ లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ లకి మంచి స్పందన వచ్చింది. విద్యార్థులు పోటా పోటీగా ప్రయోగాలను తయారుచేసి ప్రదర్శన ఏర్పాటు చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు అన్ని సబ్జెక్టులలో తమ సృజనాత్మకతను జోడిస్తూ చిన్నారులు చేసిన ప్రయోగాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులను చదువుతోపాటు అన్ని రంగాల్లో తీర్చిదిద్దే ఉద్దేశంతో ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడుతాయని ఈ సందర్భంగా జికేఆర్ స్కూల్ డైరెక్టర్లు గువ్వల కొండారెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ శైలజ, సుశీల తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో, అందుబాటులో ఉన్న వస్తువులతో అద్భుతమైన ప్రయోగాలు చేసి విద్యార్థులు అందరినీ ఆకర్షించారని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వారు వెల్లడించారు.