Guntur News: నైతిక విలువల గురించి మాట్లాడేవారు క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు
YSRCP LEADERS PRESS MEET
అధికార టీడీపీ అప్రజాస్వామిక రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఈమేరకు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబటి, మోదుగుల, అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. బలం లేకపోయినప్పటికీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నైతిక విలువల గురించి మాట్లాడేవారు క్యాంపు రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దిగజారి రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ కార్పొరేటర్లు అంతరాత్మ ప్రబోధనతో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓటు వేయాలని సూచించారు. గుంటూరు క్యాంపు రాజకీయాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని కోరారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ సంఖ్యా బలం లేకపోయినప్పటికీ వైసీపీ కార్పొరేటర్లని కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. బెదిరించి, భయపెట్టి టీడీపీలో చేర్చుకుంటున్నారని తెలిపారు.