గుంటూరులో సంక్రాంతి సంబరాలు ఆటహాసంగా జరుగుతున్నాయి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం గంగిరెద్దుల విన్యాసాలు, కర్ర సాము, కోలాటం వంటి ఆట పాటలతో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆటల్లో క్రీడాకారులు పోటాపోటీగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. అచ్చం పల్లె సీమను తలపించే విధంగా కర్ర సాము, కోలాటం నిర్వహించారు.సాంప్రదాయ వస్త్రధారణ తో ప్రజలు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు..
143 Less than a minute