ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) ను ఈ సోమవారం నుండి మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)” అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల,డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చునన్నారు. ప్రజలకి పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
234 Less than a minute