ఆంధ్రప్రదేశ్గుంటూరు
GUNTUR NEWS: గుంటూరు కొరిటిపాడు వాకింగ్ ట్రాక్ వద్ద ఆదివారం ఉచిత మెగా వినికిడి వైద్య శిబిరం
PUBLIC INFORMATION - FREE MEDICAL CAMP
రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ ఆధ్వర్యంలో ఆదివారం పలు సేవా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మేరకు స్నేహిల్ స్పీచ్ అండ్ హియరింగ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో గుంటూరు కోరిటపాడు చెరువు వద్ద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వరల్డ్ హియరింగ్ డే సందర్భంగా ఉచిత మెగా వినికిడి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ స్పీచ్ లాంగ్వేజ్ పథాలజిస్ట్, హియరింగ్ & బ్యాలెన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ఆర్. శిరీష పాల్గొని వినికిడి లోపం గల పిల్లలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. ఆదివారం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ ప్రతినిధులు ఆదిశేషు, పద్మజ, సుధీర్ బాబు, ప్రేమ్ కుమార్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.