Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్గుంటూరు

GUNTUR NEWS: మంత్రి నారా లోకేష్ పై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే వైసీపీ పార్టీ మూసివేయాలి – ఎమ్మెల్యే గళ్ళా మాధవి

ఎన్డీయే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనంను అమలు చేస్తే అది చూసి తట్టుకోలేని జగన్ రెడ్డి & కో నారా లోకేష్ మీద విషం చిమ్ముతుందని, దీనిని తాము ఏ మాత్రం సహించమని, చేసిన అసత్య ఆరోపణలు నిరాధారం అని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, నిరూపించపోతే వైసీపీ పార్టీ మూసివేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి డిమాండ్ చేసారు. మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు తల్లికి వందనం ఇచ్చిన హామీ ప్రకారం ఎంతమంది ఉంటె అంతమందికి “తల్లికి వందనం” డబ్బులు జమచేశాము.సంక్షేమం జరుగుతుంటే వైసీపీ నిరాధార ఆరోపణలు చేస్తూ నారా లోకేష్ మీద విషమ చిమ్ముతుంది. వైసీపీ పాలనలో రూ.13 వేలు ఇచ్చారు. అంటే రూ.2 వేలు జగన్ జేబుల్లోకి పోయాయా? తాడేపల్లి ప్యాలెస్ కు చేరాయా? అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రశ్నించారు. వైసీపీ చేసిన విమర్శలను చూసి ప్రజలు వైసీపీ అసహ్యించుకుంటున్నారు. ఇది వైసిపీలాగా అబద్దపు హామీలతో గెలిచి, మోసం చేసిన వైసిపి ప్రభుత్వం కాదు, ప్రజా మద్దతుతో గెలిచిన ప్రభుత్వమన్న విషయం జగన్ రెడ్డి & కో గుర్తించుకోవాలి. తమ మనుగడ కోసం నిరాధార ఆరోపణలు చేస్తాము అంటే కుదరదని హెచ్చరించారు. జగన్ పాలనలో 42 లక్షల మందికి మాత్రమే ఇస్తే కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తుందని, కుటుంబంలో ఒక్కరికే అనే షరతు పెట్టి పేద, మధ్య తరగతి విద్యార్ధులను, వారి తల్లిదండ్రులను జగన్ మోహన్ రెడ్డి మానసికంగా వేధింపులకు గురి చేసారని 2019 ఎన్నికల ప్రచారంలో “మీ ఇంట్లో ఇద్దరు పిల్లల్ని బడికి పంపండి ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున ఇస్తాము” అంటూ మీ సతీమణి, సాక్షి పత్రిక యజమాని, భారతి రెడ్డి ప్రచారం చేయలేదా? అని ఎమ్మెల్యే విమర్శించారు. జగన్‌ హయాంలో ప్రతియేటా వివిధ కారణాలతో లబ్ధిదారులను తగ్గించుకుంటూ పోయారని 2021లో 44.48 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే 2023కి ఆ సంఖ్య 42.61 లక్షలకు పడిపోయిందన్నారు. నేడు కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది లబ్ధిదారులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button