GUNTUR NEWS: మహిళలు ఆరోగ్యం మీద శ్రద్ధ చూపాలి – ఎమ్మెల్యే గళ్ళ మాధవి
WOMEN'S DAY AND MEDICAL CAMP IN TDP OFFICE
సమాజంలో మహిళలు తమ ఆరోగ్యం మీద శ్రద్ధ చూపటం లేదని, వారు ఆరోగ్యంగా ఉంటేనే వారి కుటుంబం కూడా ఆనందంగా ఉంటుంది అనే భావనతో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి తెలిపారు. శుక్రవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్డీయే కూటమి మహిళా నేతలకు, కార్యకర్తలకు అభిమానులకు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది. తొలి రోజు మెగా వైద్య శిబిరంను ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రారంభించారు. శుక్ర, శనివారం నాడు జరిగే మెగా వైద్య శిబిరాన్ని ఎన్డీయే కూటమి మహిళా నేతలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కోరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గళ్ళ మాధవి మాట్లాడుతూ… టీడీపీ, జనసేన, బీజేపీ నేతల కుటుంబ సభ్యులకు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని డివిజన్ లలో ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితముగా వైద్యాన్ని అందించటానికి కృషి చేస్తాను. మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాము. కూటమి మహిళా నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్న కార్యకర్తలు ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో మెగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు వారందరికీ రక్తపరీక్షలు చేసి, శనివారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో రిపోర్టులు అందేజేసి అవసరం అయిన వారికి ఉచితంగా మందులు కూడా అందిజేస్తాము. మెగా వైద్య శిబిరం అంటే నామ మాత్రముగా పరీక్షలు చేసి మందులు ఇచ్చి పంపటం కాకుండా అందరికీ రక్త పరీక్షలు చేసి, వారికి ఏమైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటే వెంటనే గుర్తించి నిష్ణాతులయిన వైద్యుల సహాయం అందించి, ఉచితంగా మందులు అందిజేస్తామని ఎమ్మెల్యే గళ్ళ మాధవి తెలిపారు. శనివారం నాడు జనరల్ ఫిజిషియన్,ఈ.యన్.టి, గైనకాలజీ, ఆర్థో పెడిక్, హార్ట్, వాస్క్యులర్ సర్జన్ మరియు ఇతర వైద్య నిపుణులు అందుబాటులో ఉంటామని తెలిపారు.