
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బ్రాడీపేట ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల మీద విజయవాడ ధర్నా చౌక్ వద్ద మార్చి 15న జరిగే నిరసన దీక్షలను విద్యార్థులు విద్యార్థులు వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ దీక్షలలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, తల్లికి వందనం,విద్యా దీవెన,వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలి. లేకపోతే విద్యార్థులకు చాలా భారంగా మారిపోతుందని. అలాగే ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజులు చెల్లించాలి. AP కామన్ పీజీ సెట్ ను రద్దు చేయాలి. GO నం 77 ను రద్దు చేయాలి. వెటర్నరీ విద్యార్థులకు 25 వేలరూపాయలు స్టైఫండ్ ఇవ్వాలి. మెడికల్ విద్యాసంస్థల ప్రైవేటీకరణ ఆపాలి అని ఈ దీక్షలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు షేక్ సమీర్, నగర కార్యదర్శి యశ్వంత్, నగర సహాయ కార్యదర్శి సుభాని, నగర గర్ల్స్ కన్వీనర్ సౌమ్య, జిల్లా కమిటీ సభ్యులు శ్రావణ్ తదితర విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.








