ఆంధ్రప్రదేశ్

AP NEWS: త్వరలోనే కొత్త ఫిల్మ్ పాలసీ – ఆంధ్రప్రదేశ్లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు

FILM DEVELOPMENT IN AP

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని శ్రీ శేష సాయి కళ్యాణ వేదికలో వారాహి ఆర్ట్స్ అండ్ శక్తి క్రియేషన్స్ రూపొందించిన వెస్ట్రన్ లవ్ అనే సినిమా పూజ ముహూర్త మహోత్సవానికి తొలి క్లాప్ కొట్టారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సినిమా షూటింగ్ లకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి జరగాలన్నారు. రాష్ట్రంలో స్టూడియోలు ఉన్నప్పటికీ వినియోగంలో లేవని తెలిపారు. రాష్ట్రంలో భారీగా షూటింగ్ లు జరుగుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల కొరత ఉందన్నారు. హైదరాబాద్ తరహా స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, రీ రికార్డింగ్ థియేటర్లు తదితర మౌలిక సదుపాయాలు రాష్టంలో కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చలనచిత్ర పరిశ్రమ రాష్ట్రం అభివృద్ధి చెందితే స్థానికంగా యువతకు, సిబ్బంది కి ఉపాధి లభిస్తుంది అన్నారు. ఏపీ లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవసరమైన అంశాలపై చర్చించి నిర్మాతలతో కలిసి కొత్త సినిమా పాలసీని రూపొందిస్తామన్నారు. ఇప్పటికే సంబంధిత పాలసీ కి సంబంధించి రూపకల్పన చేస్తున్నామని త్వరలోనే పాలసీని ప్రకటిస్తామన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button