
మద్దతు ధర కోసం రైతులు రోడ్డెక్కుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుపడాల్సిన విషయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంచుమాటి అజయ్ కుమార్ ఆరోపించారు. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మిర్చికి క్వింటాకు 20వేల రూపాయల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుంటూరు మిర్చి యార్డును మాయాబజార్‌లా మార్చేశారని ధ్వజమెత్తారు. మిర్చి రైతుల సమస్యలపై పాలకులు స్పందించాలన్నారు.







