
ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు నందు “10వ వారం మీకోసం మేము” పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ కార్యక్రమం జరిగినది. ఈ సందర్భంగా పేషెంట్ లు కి హాస్పిటల్ నియమావళి గురించి సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వతహాగా ఎముకల కీళ్ల విభాగం నిపుణులైన సూపర్డెంట్ డాక్టర్ ఎస్ ఎస్ వి రమణ గారు పేషెంట్లు మరియు వారి బంధువులకి జీవనశైలి మార్పులు ఎక్ససైజ్ వాటి వల్ల కలుగు ప్రయోజనాలు సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల వస్తున్న సమస్యలు మోకీలు ఆరోగ్యము మరియు మోకలు సమస్యలు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఒకవేళ మొక్కలు సమస్య వస్తే అందుబాటులో ఉన్న చికిత్స వివరాలు తెలియజేశారు. అదేవిధంగా అతిత్వరలో ప్రభుత్వ సమగ్ర వైద్యశాలను నేషనల్ ఎక్సర్సైజ్ దినోత్సవం సందర్భంగా .. మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలు రాబో రెండు నెలల్లో ప్రారంభించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఎటువంటి సమస్యలు అయినా సరే ఎవరికీ డబ్బు చెల్లించవద్దని ఒకవేళ ఎవరైనా డబ్బు అడిగితే రసీదు అడగమని ఇవ్వని పక్షాన సూపర్డెంట్ గారికి సి ఎస్ ఆర్ ఎమ్ ఓ గారికి ఫిర్యాదు చేయమని పేషంట్ డాక్టర్ ఇంట్రాక్షన్ కార్యక్రమంలో సూపరిండెంట్ డాక్టర్ ఎస్ ఎస్ వి రమణ గారు ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ స్వచ్ఛంద సేవా కార్యకర్త అయిన నాగరాజ కుమారి గారు వారి సంస్థ నుండి పేషెంట్ కి బియ్యం పంపిణీ చేశారు.








