GUNTUR NEWS : సచివాలయ ఉద్యోగులకు గత ప్రభుత్వ వాసనలు ఇంకా పోలేదు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి..
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది సచివాలయ ఉద్యోగులు గత ప్రభుత్వములో నిర్లక్ష్యంగా ఉన్నట్లు, ఈ ప్రభుత్వంలో ఉండాలంటే కుదరదని, వైసిపి ప్రభుత్వ వాసనలు ఇంకా పోలేదని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గుంటూరు 36వ డివిజన్ భాగ్యనగర్ మరియు సాయి నగర్ లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి “మీతోనే నేను – మీవెంటే నేను” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి విస్తృతంగా పర్యటించారు. ప్రజలను నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ.
ఈ రోజు 36వ డివిజన్ లో శివారు కాలనీలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నాయి.ఈ కాలనీలో ప్రజలు రోడ్లు, డ్రెయిన్లు మరియు వీధి దీపాలు, కుక్కల బెడదతో పాటు గంజాయి బ్యాచ్ నుండి తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నట్లు గుర్తించటం జరిగింది.గత వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు స్థానిక సచివాలయం సిబ్బందే దీనికి ప్రధాన కారణం.సచివాలయం సిబ్బంది కనీసం విధులకి హాజరు కావటం లేదని, కనీసం కాలువలు కూడా తీయించటం లేదని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.శివారు కాలనీలలో మంచినీటి ఎద్దడి ఉన్నదని గుర్తించాను. వీటి పరిష్కారానికి మున్సిపల్ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను.గతంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ డివిజన్ లో పర్యటించినప్పుడు ఏ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉండటం దురదృష్టకరం.
సాయి నగర్ లో ఒక వాకింగ్ ట్రాక్ కావాలని స్థానిక ప్రజలు కొరటం జరిగింది.అలాగే పంచుమర్తి వీరయ్య చౌదరి లైబ్రరీ గత వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిందని, దీనిని వాడుకలోకి తీసుకొనిరావాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని రాగా, ప్రజలకు ఉపయోగకరమైన లైబ్రరీ పునరుద్ధరణకు కృషి చేస్తానని హామినివ్వటం జరిగింది.అయితే ఈ సమస్యల మీద దృష్టి పెట్టి రానున్న 2 నెలల కాలంలో ఈ సమస్యలను పరిష్కరించటానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హామీని ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బండారు వెంకటేశ్వరరావు, మానం శ్రీనివాస్, గూడపాటి రమేష్,రోళ్ళ కోటేశ్వరరావు, సంజీవ్ రావు,తావులాల్ నాయక్, శివజ్యోతి, జూజాల రామకృష్ణ, చేబ్రోలు రవి కుమార్, రవిచంద్ర, హరిబాబు, ధూళిపాళ్ల వెంకయ్య, గుర్రం మల్లీశ్వరి, బొల్లినేని రాజారావు, గుర్రం ప్రసాద్, లంకా మాధవి, జనసేన విజయలక్ష్మి, దొండపాటి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.