GUNTUR NEWS : అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జనవరి నాటికి పూర్తి చేస్తాం
Central Minister Pemmasani
మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పడ్డ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కో-ఆర్డినేషన్ అండ్ మోనిటరింగ్ కమిటీని చైర్ పర్సన్ హోదాలో గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కలెక్టరేట్ లోని ఎస్.ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం రివ్యూ నిర్వహించారు. ఆర్ అండ్ బి, రైల్వే, ఇరిగేషన్, ఎన్ హెచ్ ఏ ఐ తదితర శాఖల ఆధ్వర్యంలో జాతీయ రహదారులు, పి. ఎమ్. జీ. ఎస్. వై, అమృత్, ఆర్ ఓ బి అండ్ ఆర్ యూ బి, గుంటూరు ఛానల్ సమస్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో పెమ్మసాని అధికారులతో చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. జాతీయ రహదారుల నిర్మాణం, అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జనవరి కి పూర్తి చేస్తాం. అమరావతి హైదరాబాద్ జాతీయ రహదారి నిర్మాణం జూలై, 2025కి పూర్తి చేస్తాం.రైల్వే బ్రిడ్జి నిర్మాణాలు రూ. 110కోట్లతో చేస్తున్నాం.ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేనెల టెండర్లు పిలుస్తాము.నందివెలుగు బ్రిడ్జి అసంపూర్తిగా మిగిలి ఉంది, దానికి కావలసిన నిధులు ఇస్తాం. శ్యామల నగర్, మంగళగిరి, పేద పలకలూరు రైల్వే బ్రిడ్జిలు త్వరలోనే పూర్తి చేస్తాం. 12 రోడ్లు గుంటూరు పార్లమెంట్ పరిధిలో నిర్మాణానికి సిద్ధంగా ఉంది. నగరంలో అమృత్ స్కీం రూ. 180కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణాలు పూర్తి చేస్తాం. విశాఖ ఉక్కుకు కేంద్రం నుంచి నిధులు తెచ్చిన చంద్రబాబు తపన ప్రజలు గుర్తించాలి. 17వేల కోట్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై కేంద్రం నుంచి తెచ్చిన ఓపిక దూరదృష్టితోనే వచ్చాయి. ఆరు నెలల్లో రాష్ట్రాల్లో అద్బుతాలు జరగవు గతంలో జరిగిన వాటిపై అడగని పరిస్థితి నెలకొంది. గుంటూరు మునిసిపల్ కార్పోరేషన్ లో జరుగుతున్న వివాదాలు ఆరోపణలు, అనేవి సహజం వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, మహమ్మద్ నసిర్, గల్లా మాధవి, కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ పులి శ్రీనివాసులు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.