GUNTUR NEWS:గుంటూరు నగరపాలక పై టీడీపీ జెండా ఎగురవేద్దాం..
గుంటూరు నగరపాలక పై టీడీపీ జెండా ఎగురవేద్దాం..
గుంటూరులో రోజు రోజుకి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నగరపాలక సంస్థ స్టాడింగ్ కమిటీ ఎన్నికలు తాజా రాజకీయాలకు మరింత హీట్ పుట్టిస్తున్నాయి. వైసీపీ నుండి కార్పోరేటర్ లు ఎవరూ టీడీపీ వైపు వెళ్లకుండా వుండేలా చూస్తున్నామని అంబటి, అప్పిరెడ్డి, మోదుగుల చెప్పిన మాటలకు బలం లేకుండా పోతోంది. ఇప్పటికే కొందరు వైసీపీని వీడి టీడీపలో చేరగా తాజాగా 57వ డివిజన్ కార్పేరకేటర్ పఠాన్ రిహానా టీడీపీలో చేరిపోయారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నసీర్ సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వైసీపీ నేతలు ఎంత ప్రగల్భాలు పలికినప్పటికీ టీడీపీ నేతలు మత్రం సైలంట్ గా చేయాల్సిన పనిని చక్కగా చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. తొలుత స్టాండింగ్ కమీటీలో విజయం సాధించాలన్న లక్ష్యంతోనే వేగంగా పావులు కదుపున్నారు. వారు అనుకున్న విధంగా స్ఠాండింగ్ కమీటీ ఎన్నికల్లో కనుక విజయం సాధిస్తే ఇక మేయర్ ని దించడమే టార్గెట్ గా పెట్టుకోనున్నారు. ఇప్పటి వరకు కార్పోరేషన్ పాలకవర్గం వైసీపీ చేతిలో ఉండగా త్వరలోనే టీడీపీ పాలకవర్గంగా మారిపోయే అవకాశమూ లేకపోలేదూ. ఫిబ్రవరి 3వ తేదీన వెలువడడే నగరపాలకసంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు గుంటూరు నగర రాజకీయాల్లో సంచలనం కానున్నాయి.