గుంటూరు నగరంలో పెరిగిన ట్రాఫిక్ నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగరంలోని శంకర్ విలాస్ ఆర్.ఓ.బి నిర్మించుటకు ఇప్పటికే అనుమతులు మంజూరయ్యాయని, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా నగర పాలక సంస్థ తరుపున చేపట్టవలసిన రోడ్డు విస్తరణ పనులు శనివారం నుండి ప్రారంభించామని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనుల నిమిత్తము చేపట్టిన రోడ్డు విస్తరణ పనులలో భాగంగా మొత్తము 134 ఆస్ధులలో బ్రాడీపేట అరండల్ పేటలకు సంబంధించిన 99 భవన యజమానులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని, 14 ప్రభుత్వ భవనాలకు, 21 మిషనరీ ఆస్తులకు రోడ్డు విస్తరణకు గాను నోటీసులు అందజేశామని తెలియచేశారు. ప్రైవేట్ భవన యజమానులు స్వచ్చందంగా రోడ్డు విస్తరణకు ముందుకు వచ్చి అంగీకార పత్రాలను నగర పాలక సంస్థకు అందజేశారన్నారు. విస్తరణలో వారి ఆస్తి అర్హతను బట్టి భవన యజమానులకు నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తొలుతగా నగర పాలక సంస్థ రోడ్డు విస్తరణ క్రమంలో భవన తొలగింపు కార్యక్రమం శనివారం నుండి ప్రారంభించిందని, అంగీకారపత్రములు అందించిన బిల్డింగ్ నెంబర్ 119, క్లాస్ 4 ఎంప్లాయిస్ అసోసియేషన్ తాలూకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఆరు షాపులు ఫస్ట్ ఫ్లోర్లను అసోసియేషన్ భవనము విస్తరణలో కోల్పోవుచున్న భాగమును ఈరోజు జీఎంసీ వారు కూల్చివేత పనులు ప్రారంభించారు. ఆర్.ఓ.బి నిర్మాణం కొరకు ఈ రోడ్డు విస్తరణ పనులు నిరంతరంగా జరుగుతాయని, విస్తరణలో మార్కింగ్ ప్రకారం వారి ఆస్తి విలువను బట్టి భవన యజమానులకు కోల్పోయిన భావనముల క్రింద నష్టపరిహారం, స్థలము విలువనకు 4 రెట్లు విలువైన టి.డిఆర్ బాండ్లను అందజేయుట జరుగుతుందని, కావున ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికావద్దని, నగర అభివృద్ధికి కొరకు చేపట్టుచున్న రోడ్డు విస్తరణకు ప్రజలు సహాకరించవలసినదిగా కోరారు.
165 1 minute read